కలం, కరీంనగర్ బ్యూరో : డాక్టర్ బి.ఎన్ రావు ఆధ్వర్యంలో ఫౌండేషన్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం గొప్పదని, ఆయన సేవలు చిరస్మరణీయమని కరీంనగర్ (Karimnagar) నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజయ్య కుమార్ కొనియాడారు. బుధవారం నగరంలోని ఫిలిం భవన్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఎన్.రావు ఫౌండేషన్ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సులో అంజన్ కుమార్ మాట్లాడారు.
వైద్య వృత్తితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బి.ఎన్.రావు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరిన్ని సేవలు అందించవచ్చన్నారు. అనంతరం బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, చొప్పదండి మాజీ జెడ్పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో సమాజంలో అనేక మార్పులు వస్తాయని తెలిపారు. సమాజంలో కొంతమంది మాత్రమే సమాజం గురించి ఆలోచిస్తారని అందులో బి.ఎన్.రావు ఒకరని కొనియాడారు.
అనంతరం బి.ఎన్.రావు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి.ఎన్.రావు మాట్లాడుతూ నేటి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని వనరులు మన దేశంలో ఉన్నాయని చెప్పారు. మానవరాలను ఉపయోగించుకుని దేశాభివృద్ధికి యువత పాటుపడాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ డి హరికాంత్, బికాన్ సంస్థ సీఎండీ మధుసూదన్ రెడ్డి, ఎంఐఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, రాష్ట్ర గర్ల్స్ బాధితుల సంఘం అధ్యక్షురాలు బూత్కూరి కాంతా, బి యుగంధర్ , జక్కన్న పల్లి గణేష్, అతికం రాజశేఖర్, చెట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

