Mobile Popup Ad
Mobile Popup Ad

ఆసియా బాక్సింగ్ బరిలోకి భారత యువత!

కలం, స్పోర్ట్స్: ఆసియా బాక్సింగ్ (Asian Boxing Championships) బరిలో తమ సత్తా చాటడానికి భారత యువ బాక్సర్లు సన్నద్ధమయ్యారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జూలై 3వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక ఆసియా అండర్-19, అండర్-23 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) బలమైన భారత జట్లను ప్రకటించింది. ఆసియా ఛాంపియన్ విశ్వనాథ్ సురేష్, వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ బంగారు పతక విజేత చంద్రిక పూజారి ఈ టోర్నీలో భారత జట్టును ముందుండి నడిపించనున్నారు.

ఈ టోర్నీ కోసం భారత బాక్సర్లు జాతీయ శిక్షణా శిబిరంలో సుదీర్ఘ కాలంగా కఠినమైన శిక్షణ తీసుకున్నారు. రింగ్‌లో ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలు, శారీరక దృఢత్వం, ఆటతీరును మెరుగుపరుచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. యువ బాక్సర్లు సీనియర్ స్థాయికి ఎదగడానికి ఈ ఆసియా ఛాంపియన్‌షిప్ పోటీలు ఎంతో కీలకమైనవని బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి మన అథ్లెట్లకు అవసరమైన అనుభవాన్ని అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు.

ఈ ఛాంపియన్‌షిప్‌లో (Asian Boxing Championships) అండర్-23 పురుషుల విభాగంలో ఆసియా ఛాంపియన్ విశ్వనాథ్ సురేష్ (50 కేజీలు) జట్టుకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు గంగ (55 కేజీలు), సాగర్ జాఖర్ (60 కేజీలు), వన్షాజ్ (65 కేజీలు), హితేష్ (70 కేజీలు), నీరజ్ (75 కేజీలు), ఆర్యన్ మాలిక్ (80 కేజీలు), రాకీ చౌదరి (85 కేజీలు), హేమంత్ సాంగ్వాన్ (90 కేజీలు), ఈషాన్ కటారియా (+90 కేజీలు) బరిలోకి దిగుతున్నారు.

ఇక అండర్-23 మహిళల జట్టు విషయానికి వస్తే.. నిధి (48 కేజీలు), తను (51 కేజీలు) జట్టును నడిపిస్తున్నారు. వీరితో పాటు నిషా (54 కేజీలు), ప్రాచి (57 కేజీలు), నికిత చంద్ (60 కేజీలు), కాజల్ (65 కేజీలు), శివాని (70 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), నైనా (80 కేజీలు), ప్రియాంక (+80 కేజీలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మరోవైపు, అండర్-19 విభాగంలో బాలికల జట్టుకు ఫ్యూచర్స్ కప్ స్వర్ణ పతక విజేత చంద్రిక భోరేష్ పూజారి (51 కేజీలు) నాయకత్వం వహిస్తున్నారు. ఈమెతో పాటు గుంజన్ (48 కేజీలు), చిరొమ్ జాయ్‌శ్రీ దేవి (54 కేజీలు), ప్రాచి (57 కేజీలు), చాహత్ (60 కేజీలు), వన్షిక (65 కేజీలు), లక్ష్మి (70 కేజీలు), అన్షిక (75 కేజీలు), మేఘా షియోకండ్ (80 కేజీలు), ప్రాచి తోకాస్ (+80 కేజీలు) ఎంపికయ్యారు.

అండర్-19 బాలుర జట్టులో లైరెన్‌లాక్‌పామ్ అంబేకర్ మీటీ (50 కేజీలు), ఆదిత్య (55 కేజీలు), సికందర్ (60 కేజీలు), మౌసమ్ సుహాగ్ (65 కేజీలు), ప్రశాంత్ (70 కేజీలు), దేవేంద్ర చౌదరి (75 కేజీలు), లోకేష్ (80 కేజీలు), సాగర్ (85 కేజీలు), శుభమ్ రాజ్‌పుత్ (90 కేజీలు), లోవెన్ గులియా (+90 కేజీలు) స్థానం సంపాదించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>