కలం, వెబ్ డెస్క్ : శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలానికి 15,819 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అయితే స్పిల్‌వే, సుంకేసుల, హంద్రీ ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం ఎటువంటి ఇన్‌ఫ్లో నమోదు కాలేదు.
ప్రస్తుతం శ్రీశైలం వద్ద నీటిమట్టం 877.10 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, నిల్వ సామర్థ్యం 173.4698 టీఎంసీలుగా నమోదైంది. జలవిద్యుత్ ఉత్పత్తి కోసం ప్రస్తుతం 40,055 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం స్పిల్‌వే గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు.

