Mobile Popup Ad
Mobile Popup Ad

ఉగ్రవాదిలా మాట్లాడుతున్న రాహుల్: బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరు నేతలను ఆయన ద్రోహులంటూ అభివర్ణించారు. రాయబరేలిలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ (Rahul Gandhi)  మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను ప్రజలు బహిరంగంగా అడ్డుకొని.. ప్రధానమంత్రి ద్రోహి, మీ హోం మంత్రి ద్రోహి, మీ సంస్థ ద్రోహి అని చెప్పాలని వ్యాఖ్యానించారు. దేశాన్ని అమ్మేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

భారతీయులను అవమానించిన రాహుల్ : బీజేపీ

రాహుల్ విమర్శలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారని బీజేపీ మండిపడింది. రాహుల్ 140 కోట్ల భారతీయులను అవమానించారు. బీజేపీ నాయకులు రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన భాష పాకిస్థాన్ తరహా మాటలను పోలి ఉందని విమర్శించారు. 140 కోట్ల భారతీయులను అవమానించేలా ఆయన మాట్లాడుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దేశంలో అస్థిరత సృష్టించే ప్రయత్నంగా ఉన్నాయని పేర్కొన్నారు.

మొత్తం మీద ఈ వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. రాజ్యాంగంపై, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌పై, మహాత్మా గాంధీ సిద్ధాంతాలపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

మోదీపై రాహుల్ విమర్శలు

తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించిన రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రధాని మోదీ ఇటలీ ప్రధానికి మెలోడి క్యాండీ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ మరోసారి విమర్శలు చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రధాని వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో రైతులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని, కానీ ప్రభుత్వం ఆ సమస్యలను పట్టించుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు.

నాయకత్వం గంభీరంగా ఉండాల్సిన సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు రాహుల్ వ్యాఖ్యలను దేశ వ్యతిరేకంగా అభివర్ణించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ భాష శత్రుదేశాల భాషను పోలి ఉందని ఆరోపించారు. దేశంలో అశాంతి రేపే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.

 Read Also: మోడీ.. ‘మెలోడీ’.. నష్టాల నుంచి భారీ లాభాల్లోకి పార్లే షేర్స్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>