కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా కీలక నిర్ణయం తీసుకోబోతున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఇదే స్థాయిలో కోటా కల్పించాలనే డిమాండ్ ఊపందుకుంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పార్టీ అగ్రనేత అమిత్ షా కీలక హామీ ఇచ్చారు. ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం ‘లక్ష్మీర్ భండార్’ (Lakshmir Bhandar Scheme) వంటి అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. అయితే చట్టసభల్లో రిజర్వేషన్లు 2029 నుండి అమలులోకి రానున్న నేపథ్యంలో 33 శాతం ఉద్యోగ రిజర్వేషన్ల హామీ ఇప్పుడు బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ రిజర్వేషన్ల ప్రకటన మహిళా సాధికారతకు బాటలు వేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఇది ఏ మేరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి.
Read Also: నేపాల్ ప్రధాని సంచలనం.. ప్రోటోకాల్ పక్కనపెట్టి ప్రజా క్షేత్రంలోకి!
Follow Us On: X(Twitter)

