కలం, నిజామాబాద్ బ్యూరో: రాబోయే గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ (Nizamabad) పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లోని ఘాట్‌ల వద్ద ఏర్పాట్లు చేపట్టాలని బీజేపీ ఎంపీ అర్వింద్ (Dharmapuri Arvind) కోరారు. ఈ మేరకు ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేఖ రాశారు. పుష్కరాల కోసం నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో గోదావరి ఘాట్లకు కోట్లాది మంది వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా కందకుర్తి, పోచంపాడ్, తడపాకల్, వాల్గొండ వంటి ప్రధాన ఘాట్ల వద్ద భక్తుల రద్దీ ఉండనున్నందున, భారీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, మరుగుదొడ్లు, పోలీస్ భద్రత, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్, ఆర్టీసీ, ఇతర సేవలపై ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకుఅవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి, పనులు పూర్తి చేయాలని ఎంపీ అర్వింద్ కోరారు.
Read Also: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. నోటీసులిచ్చిన జేఏసీ
Follow Us On: Sharechat

