తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. నోటీసులిచ్చిన జేఏసీ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఆర్టీసీ  కార్మిక సంఘాలు మళ్లీ సమ్మె సైరన్ మోగించేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నేతలు సమ్మె నోటీసులను ఈడీ వెంకన్నకు అందజేశారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2021 వేతన సవరణ చట్టం ప్రకారం 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని, మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కోసం ఇస్తున్న రూ.350 కోట్లలో ఎలాంటి కోతలు, షరతులు లేకుండా పూర్తిగా ఇచ్చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అలాగే పాత బకాయిలు రూ.2500 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు.

తమ డిమాండ్లు నెరవేర్చకపోతే 14 రోజుల తర్వాత సమ్మె తేదీపై నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు జేఏసీ నేతలు. ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రం అందజేశామని.. కానీ ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం లేదన్నారు జేఏసీ నేతలు. ఈ సారి స్పష్టమైన హామీ లేకపోతే సమ్మె సైరన్ మోగిస్తామని ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నేతలు తేల్చి చెప్పారు.

Read Also: టెన్త్ స్టూడెంట్స్‌కు TGSRTC గుడ్‌న్యూస్

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>