కలం, వెబ్ డెస్క్ : డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మూవీ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఏపీలో టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. మార్చి 19న ఏపీలోని అన్ని థియేటర్లలో బెనిఫిట్ షో వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ బెన్ ఫిట్ షో టికెట్ ధరలను రూ.500గా నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. 19న బెన్ ఫిట్ షోతో పాటు ఐదు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాగే రిలీజ్ అయినప్పటి నుంచి మొదటి పది రోజుల దాకా ప్రతి టికెట్ మీద సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ రేట్ల మీద రూ.100, మల్టీప్లెక్స్ లో రూ.125 అదనంగా పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆ తర్వాత సాధారణ టికెట్ రేట్లు ఉండనున్నాయి. ఇటు తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి జీవోలు ఇవ్వలేదు. ఇప్పటికే రెండు సార్లు జీవోలు హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ కు (Ustaad Bhagat Singh) ఇస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Read Also: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న అనుష్క.. వరుడు ఎవరంటే!
Follow Us On: Instagram

