కలం వెబ్ డెస్క్ : బీజేపీ(BJP) ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizam Sagar Project), దాని కాలువల పునరుద్ధరణ విషయంపై వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. గత ఏడు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టుపై ఎలాంటి మెయింటెనెన్స్ లేదా పునరుద్ధరణ పనులు చేపట్టలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో నీటి సమస్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మూసీ పునరుద్ధరణ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. నేడు కృష్ణా జలాలపై రెండు పార్టీల పీపీటీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నిజాంసాగర్‌ను (Nizam Sagar) ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. తక్షణమే ఈ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టు పునరుద్ధరణకు హామీ ఇచ్చినా ఇంకా పనులు మొదలుకాలేదు.
Read Also: రోహిత్, కోహ్లీ కోసం వన్డే మ్యాచ్‌లు పెంచాలి : ఇర్ఫాన్ పఠాన్
Follow Us On: Youtube


