కలం, వెబ్ డెస్క్: శనివారం తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ భూ నిర్వాసితులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఆదిలాబాద్ రైతుల భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొరాట చనాక ప్రాజెక్ట్ పూర్తి చేయాలని నినాదాలు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేసింది, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించిందని మండిపడ్డారు. ఆదుకోవాలి ఆదుకోవాలి.. రైతులను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆదిలాబాద్ నిర్వాసితులకు (Adilabad Farmers) ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు తెలిపారు.
Read Also: స్క్రాప్ నుంచి సూపర్ బైక్.. ఇండియా స్టూడెంట్స్ ఇన్నొవేషన్ అదరహో!
Follow Us On : WhatsApp


