కాంగ్రెస్‌పై ఫైర్.. ఛలో ఇందిరాపార్క్ దీక్షలో ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని రైతులు, అమాయకుల భూములను రాష్ట్ర ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేయడం సిగ్గుచేటని బీజేపీ నేత, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) మండిపడ్డారు. శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దీక్షకు ఇందూరు నుంచి భారీగా తరలివెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ మెడలు వంచే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అమాయక ప్రజల భూములతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలని 22 ఏ చట్టం చెబితే… ఈ ప్రభుత్వం మాత్రం రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. అంతకుముందు దీక్షకు వెళ్లే వాహనాలకు ఇందలవాయి టోల్గేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>