కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)మధ్యప్రదేశ్‌లో వేసిన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై ఓ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందంటూ మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి బాంబు పేల్చారు. తెలంగాణలో మీనాక్షిపై క్రిమినల్ కేసు నమోదైందని, ఆమె ఈ విషయాన్ని అఫిడవిట్‌లో మెన్షన్ చేయలేదని ఈసీకి బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే దీనిపై బీజేపీ మంత్రి కైలాశ్ (Minister Kailash) మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) మీద ఉన్న కేసు వివరాలను తెలంగాణ కాంగ్రెస్ నాయకులే తమకు అందించారని చెప్పారు. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని, అలాంటప్పుడు ఆమె కేసు వివరాలు మా దాకా ఎలా వస్తాయని కైలాశ్ ప్రశ్నించారు. తెలంగాణ నుంచే కేసు వివరాలు వచ్చాయన్నారు. కైలాశ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ మధ్యప్రదేశ్ ప్రదేశ్ బీజేపీ నేతలకు తెలంగాణలో మీనాక్షి కేసు వివరాలను ఎవరి ఇచ్చి ఉంటారా? అని చర్చ నడుస్తోంది.
Read Also: CM రేవంత్ ధీమా.. ఎమ్మెల్యేల్లో డైలమా.. కారణమదేనా??
Follow Us On : WhatsApp

