కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha)కు సంబంధించిన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి అనిత, ఎవరో ఉద్దేశపూర్వకంగానే తన సోషల్ మీడియా ఖాతాను హ్యాక్ చేశారని అనకాపల్లి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ సైబర్ భద్రతా ఉల్లంఘనపై ఆమె సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణతో ఫోన్ ద్వారా మాట్లాడి, తాజా పరిస్థితిని చర్చించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు అన్ని కోణాల్లోనూ ముమ్మర దర్యాప్తు

