Mobile Popup Ad
Mobile Popup Ad

మేడ్చ‌ల్‌లో ఫేక్‌ వెండి కాయిన్స్ పంచిన బీజేపీ అభ్య‌ర్థి

క‌లం, వెబ్ డెస్క్‌: మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో (Municipal Elections) ఓట్ల కోసం అభ్య‌ర్థులు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. డ‌బ్బు, మ‌ద్యం మొద‌లుకొని ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు ఎన్నో కానుక‌లు స‌మ‌ర్పించుకుంటున్నారు. మేడ్చ‌ల్‌(Medchal)లోని అలియాబాద్ మున్సిపాలిటీలో ఐదో వార్డ్‌లో పోటీ చేస్తున్న‌ బీజేపీ అభ్య‌ర్థి ఏకంగా ఓట‌ర్ల‌కు వెండి కాయిన్లు పంచిపెట్టారు. త‌న‌కే ఓటు వేసి గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరాడు. వెండి కాయిన్లు చూసి సంతోషంగా తీసుకున్న జ‌నం ఆ త‌ర్వాత షాక‌య్యారు. ఎందుకంటే స‌ద‌రు అభ్య‌ర్థి పంచిన‌వి ఫేక్ వెండి కాయిన్లు(Fake Silver Coins). దీంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ బీజేపీ అభ్య‌ర్థిపై తిర‌గ‌బ‌డ్డారు. ఓట్ల కోసం ఓట‌ర్ల‌నే మోసం చేద్దాం అనుకున్నావా అంటూ వాగ్వాదానికి దిగారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>