చివరి నిమిషంలో పంపకాలు.. ప్రలోభాలు..!

కలం, మెదక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) బరిలో నిలిచిన అభ్యర్థులు ఏ ఒక్క ఓటును కుడా వదలటం లేదు. గెలుపే లక్ష్యంగా ఇప్పటికే పంపకాలు చేసిన లీడర్లు.. చివరి నిమిషంలో బూత్ దగ్గర సైతం పంపకాలు చేస్తూ గొడవలకు దిగుతున్నారు. మీరు పంచారంటే… మీరు పంచారంటూ ముష్టి యుద్ధాలు చేస్తున్నారు. మెదక్(Medak) జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పలు వార్డుల దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. 8వ వార్డు, 15 వార్డుల వద్ద కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS), బీజేపీ(BJP) కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని మూడు పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగ‌డంతో తోపులాట జ‌రిగింది. పోలీసులు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>