Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. 28వేల కోళ్లు మృతి

కలం, డెస్క్ : ఏపీలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం రేపుతోంది. చిత్తూరు (Chittoor) జిల్లాలోని సుదుం మండలం పుట్టవారి పల్లి, అమ్మగారి పల్లి, కంభంవారి పల్లిలో గ్రామాల్లోని కోళ్ల ఫారాల్లో గత వారం రోజుల్లో 28వేల కోళ్లు చనిపోయాయి. దీంతో అధికారులు కోళ్లకు పరీక్షలు చేయగా.. బర్డ్ ఫ్లూ ఉన్నట్టు తేలింది. దీంతో వ్యాధి ఇతర కోళ్ల ఫారాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. చనిపోయిన వాటితో పాటు బతికున్న కోళ్లను కూడా నిర్మూలిస్తున్నారు. కోళ్లను గ్రామాల శివార్లలో జేసీబీల సాయంతో పూడ్చేస్తున్నారు అధికారులు.

కోళ్ల వ్యర్థాలను బయట పడేయొద్దని.. భూమిలోనే పూడ్చి పెట్టాలని అధికారులు తెలిపారు. కోళ్ల ఫారాల్లోకి కొత్త వ్యక్తులను రానివ్వొద్దని.. ఇతర ఫారాల్లో కోళ్లకు కొత్త లక్షణాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. అయితే ఏపీకి బర్డ్ ఫ్లూ రావడం ఇదేం కొత్త కాదు. గతేడాది ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తా, నెల్లూరు జిల్లాల్లోనూ బర్డ్ ఫ్లూ వ్యాపించింది. అప్పుడు వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇప్పుడు మరోసారి బర్డ్ ఫ్లూ (Bird Flu) వ్యాపించడంతో కట్టడి చేసేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: కర్ణాటకలో ఏపీ వాసులకు ఘోర ప్రమాదం..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>