కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా వచ్చిన నాటి నుంచి కొందరు ఫేమస్ కావడానికి తెగ రీల్స్ చేస్తున్నారు. కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నిషేదిత ప్రదేశాల్లో, ప్రాంతాల్లో తమ ట్యాలెంట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సెక్రటేరియట్ (Telangana Secretariat) సమీపంలో ఓ వ్యక్తి ఇన్ స్ట్రా గ్రామ్ రీల్స్ తీయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. లుంబినీ పార్క్, సచివాలయం సమీపంలో ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేస్తున్న ఇబ్రహీం బేగ్ (23) అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రీల్స్ చేసేవారికి పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్ ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా స్టంట్స్ చేస్తూ ప్రజల భద్రతకు ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: కరీంనగర్‌లో భారీ బ్యాంకింగ్ స్కాం.. 130 కోట్ల మోసం
Follow Us On: Facebook

