Mobile Popup Ad
Mobile Popup Ad

పెద్ది కోసం వెనక్కు తగ్గిన విశ్వంభర..?

కలం, వెబ్ డెస్క్ : పెద్ది సినిమా కోసం విశ్వంభర (Viswambhara) వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ కు మంచి క్రేజ్ వస్తోంది. అయితే శ్రీరామనవమి రోజు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర నుంచి సాలీడ్ అప్డేట్ ఇవ్వాలని చూశారు. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా చాలా రోజులుగా షూటింగ్ లోనే ఉంది. ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ పడుతున్నారు. అందుకే ఫ్యాన్స్ ను ఖుషీ చేయడం కోసం మూవీ ట్రైలర్ గురించి సాలీడ్ అప్డేట్ ఇవ్వాలని అనుకున్నారంట.

కానీ అదే సమయంలో పెద్ది గ్లింప్స్ పోటీకి రావడంతో విశ్వంభర వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. ఒకే ఇంట్లో నుంచి రెండు అప్డేట్లు ఇస్తే బాగుండదనే ఉద్దేశంతో ఇలా చేశారంట. లేదంటే పెద్ది స్థానంలో విశ్వంభర (Viswambhara) అప్డేట్ ఉండేదని తెలుస్తోంది. పెద్ది (Peddi) రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సందర్భంగా ఆ సినిమాకు ప్రమోషన్ కలిసి రావాలనే ఉద్దేశంతోనే చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Read Also: ఉదయం నిద్రలేవగానే తలనొప్పి వస్తుందా.. నిర్లక్ష్యం చేయొద్దు !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>