Bihar Results | బీహార్ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో ఎన్‌డీఏ(NDA) భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. మహాగఠ్‌బంధన్(Mahagathbandhan) బాగానే రాణిస్తున్నప్పటికీ.. అందులో ఆర్‌జేడీ భాగస్వామ్యే అధికంగా ఉంది. కాంగ్రెస్ నామమాత్రంగా 10లోపు సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. కాగా ఎన్‌డీఏ కూటమిలో జేడీయూ, బీజేపీ రెండూ కూడా హోరాహోరీగా రాణిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఎన్‌డీఏ కూటమికి చెందినవే అయినప్పటికీ భారీ ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే జేడీయూ ఆఫీసు దగ్గర మిఠాయిలు కూడా పంచడం ప్రారంభించారు. బీజేపీ 81, జేడీయూ 75, ఎన్‌జేపీ 17, ఆర్జేడీ 39, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంతో ఉన్నాయి. ఈ క్రమంలోనే కీలక నియోజకవర్గాల్లో వాతావరణం వేడెక్కుతోంది.
Bihar Results :
రాఘోపుర్:
విపక్షాల తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) మొదట్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, తాజా రౌండ్‌లల్లో ఆయన స్థానం బలహీనమైంది. మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ముందు వెనుకబడిన భాజపా అభ్యర్థి సతీశ్ కుమార్(Nitish Kumar) ఊహించని వేగం చూపుతూ పోటీని హోరాహోరిగా మార్చారు.
మహువా:
తేజస్వీ యాదవ్ సోదరుడు, జజద (జనశక్తి జనతాదళ్) నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం లో ఎల్‌జేపీ (రాంవిలాస్) అభ్యర్థి సంజయ్ కుమార్ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో ఉండగా, ఆర్జేడీ రెండో స్థానాన్ని దక్కించుకుంది.
తారాపూర్:
భాజపా తరఫున పోటీలో ఉన్న, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ ఇక్కడ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని గతంలో ఆయన తల్లి కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ కుమార్ వెనుకబడిన స్థితిలో ఉన్నారు.
లఖిసరాయ్:
ఇక్కడ డిప్యూటీ సీఎం మరియు భాజపా అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా తన ఆధిక్యం కోల్పోయారు. కాంగ్రెస్ అభ్యర్థి అమరేశ్ కుమార్, జన్ సురాజ్ తరఫున పోటీ చేస్తున్న సూరజ్ కుమార్ ఇద్దరూ పోటీలో నిలిచారు.
అలీనగర్:
జానపద గాయని నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భాజపా అభ్యర్థి మైథిలి ಠాకూర్ తొలి ప్రయత్నంలోనే స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేస్తున్నారు.
సుపౌల్:
ఇక్కడ బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (భాజపా) ముందంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి మిన్నతుల్లాహ్ రహమానీ వెనుకంజలో ఉన్నారు.
కఠిహార్:
భాజపా అభ్యర్థి తార్కిశోర్ ప్రసాద్ ఈ నియోజకవర్గంలో బలమైన ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు.
కుటుంబ:
హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) ప్రతినిధి లలన్ రామ్ ముందంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్ కుమార్ వెనుకబడి ఉన్నారు.
గయా టౌన్:
ఇక్కడ భాజపా అభ్యర్థి ప్రేమ్ కుమార్ ముందంజలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అఖౌరీ ఓంకార్ నాథ్ వెనుకంజలో ఉన్నారు.
Read Also: భారీ మెజార్టీలో నవీన్ యాదవ్.. ఎంతంటే..!
Follow Us on: Youtube

