epaper
Tuesday, November 18, 2025
epaper

భారీ మెజార్టీలో నవీన్ యాదవ్.. ఎంతంటే..!

జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) దూసుకెళ్తున్నారు. ఇప్పటికే భారీ మెజార్టీ సాధించారు. అతి సమీప అభ్యర్థి మాగంటి సునీత కన్నా 19వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రారంభం నుంచే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బలమైన ఆధిక్యాన్ని చూపిస్తూ ముందంజలో దూసుకెళ్తున్నారు. వరుసగా ఏడు రౌండ్లలోనూ ఆయనే ముందున్నరు, ఏడు దశల లెక్కింపు ముగిసే సరికి ఆయన ఆధిక్యం 19 వేల ఓట్లను దాటింది. ఇప్పటివరకు షేక్‌పేట, ఎర్రగడ్డ, రహమత్‌నగర్ డివిజన్‌ల బ్యాలెట్ల లెక్కింపు ముగిసింది. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు మొత్తం 101 నమోదవగా, వాటిలో 96 మాత్రమే చెల్లుబాటయ్యాయి. వీటిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 43, BRS అభ్యర్థి మాగంటి సునీతకు 25, భాజపా అభ్యర్థి దీపక్ రెడ్డికి 20 ఓట్లు దక్కాయి.

రౌండ్‌ల వారీగా ప్రముఖ అభ్యర్థులు పొందిన ఓట్లు (పునర్వ్యాఖ్యానం)

1వ రౌండ్

Naveen Yadav (కాంగ్రెస్): 8,911

మాగంటి సునీత (BRS): 8,864

దీపక్ రెడ్డి (భాజపా): 2,167

2వ రౌండ్

నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 9,691

మాగంటి సునీత (BRS): 8,609

దీపక్ రెడ్డి (భాజపా): 3,475

3వ రౌండ్

నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 11,082

మాగంటి సునీత (BRS): 8,082

దీపక్ రెడ్డి (భాజపా): 3,475

4వ రౌండ్

నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 9,567

మాగంటి సునీత (BRS): 6,020

5వ రౌండ్

నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 12,283

మాగంటి సునీత (BRS): 8,985

Read Also: ఢిల్లీ పేలుళ్ల సూత్రదారి ఉమర్‌ ఇల్లు పేల్చివేత

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>