కలం, వెబ్ డెస్క్: పొగరాయుళ్లకు (Smokers) కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. సిగరెట్లు, సిగరెట్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2025 ఆమోదం పొందితే.. దేశంలో సిగరెట్ ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఈ బిల్లు సిగరెట్లు, సిగార్లు, పొగాకు, హుక్కా లాంటి అనేక రకాల పొగాకు ఉత్పత్తులపై సుంకాలను సవరిస్తుంది. దీని ప్రకారం.. సిగరెట్ ధరలు పెరిగే అవకాశాలున్నాయి.
పొగాకుపై సుంకాలు 25 నుంచి 100 శాతానికి నాలుగు రెట్లు (Prices) పెరగనున్నాయి. హుక్కా పొగాకు 25 నుంచి 40 శాతం పెరగనున్నాయి. ఒకవేళ సిగరెట్ ధర 10 ఉంటే 15కు పెరగవచ్చు. రాజ్యసభ ఈ చట్టాన్ని ఆమోదించి లోక్‌సభకు తిరిగి పంపింది. ధరల పెరుగుదల భారతదేశంలో ధూమపానం చేసేవారి సంఖ్యను తగ్గిస్తుందని చాలామంది భావిస్తున్నారు.
Read Also: బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్.. దేనిలో ప్రోటీన్ ఎక్కువ?
Follow Us On : WhatsApp


