కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోబోతున్నాయా? స్టార్ హీరోయిన్ త్రిష (Vijay-Trisha) రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో విజయ్ తాను పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు నియోజకవర్గాల్లోనూ భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
అయితే విజయ్ వదులుకునే ఆ స్థానంలో ప్రముఖ నటి త్రిషను బరిలోకి దించాలని పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆమె ఉపఎన్నికలో విజయం సాధిస్తే, ఏకంగా ఆమెను డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం కూడా ఉందనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్-త్రిష (Vijay-Trisha) కాంబినేషన్‌ను ఇప్పుడు రాజకీయ తెరపై కూడా చూడబోతున్నామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: మమతా నివాసం వద్ద ఉద్రిక్తత: జై శ్రీరామ్ నినాదాలు..!
Follow Us On: Instagram

