Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ రాజీనామా సంకేతాలు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay)  కాంగ్రెస్ (Congress) పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఎదిగి, తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన డి. శ్రీనివాస్ పెద్ద కుమారుడైన సంజయ్ గత కొంతకాలంగా పార్టీలో తనకు తగిన గుర్తింపు దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా పట్టింపు లేదని ఆయన తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

ఆరు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంజయ్, జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ పార్టీలో మాత్రం ప్రాధాన్యం తగ్గిందనే భావనతో ఉన్నారు. ఇదే కారణంగా ఆయనపై రాజీనామా చేయాలని అనుచరులు, కార్యకర్తలు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లో తన ముఖ్య అనుచరులతో సంజయ్ సమావేశాలు నిర్వహిస్తున్నారని, మధ్యాహ్నం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానం పెద్దలను కలిసి తన అభిప్రాయాన్ని తెలియజేయాలని కూడా భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో పలువురు నేతలకు వివిధ కార్పొరేషన్, సలహాదారు, చైర్మన్ పదవులు దక్కగా, తనను మాత్రం పక్కన పెట్టారని సంజయ్ అసంతృప్తిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆయనకు అవకాశం రాకపోవడం, తరువాత స్టేట్ కార్పొరేషన్ పదవి ఇస్తారన్న ప్రచారం కూడా నెరవేరకపోవడం ఆయనను మరింత నిరాశకు గురిచేసింది. తండ్రి డి. శ్రీనివాస్ మరణం  సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని భావిస్తున్న సంజయ్, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>