సర్.. భువనగిరి ఫస్ట్.. మల్కాజిగిరి లాస్ట్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ‘సర్’ (Telangana SIR) ప్రక్రియ వివాదాల మధ్య కొనసాగుతున్నది. అన్ని ఇళ్ల విజిట్ పూర్తయిందని, ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఆదివారం సాయంత్రం ప్రకటించింది. కానీ చాలా ఇండ్లకు ఆ ఫారాలు అందనేలేదని ప్రజల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ రాష్ట్రంలో సగటున 64.81% పూర్తయినట్లు సీఈఓ ప్రకటించింది. ఆ లెక్కల ప్రకారం అత్యధికంగా భువనగిరి జిల్లాలో 88.43% పూర్తికాగా కేవలం 37.30 శాతంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చివరి స్థానంలో ఉన్నది.

హైదరాబాద్ సిటీలో ఇప్పటివరకు 39.59% పూర్తయినట్లు తెలిపింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 29,79,130 మంది ఓటర్లలో 11,11,134 ఫారాలు డిజిటలైజ్ అయినట్లు తెలిపింది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47,36,669 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తయినా 18,75,323 ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో సైతం ఈఎఫ్‌ల డిజిటైజేషన్ 48.52% నమోదైంది.

హైదరాబాద్ సిటీ సహా ఆనుకుని ఉన్న మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో సైతం డిజిటైజేషన్ ప్రాసెస్ 50% దాటకపోవడం గమనార్హం. సిద్దిపేట (83.55%), నల్లగొండ (82.74%), ఆసిఫాబాద్ (81.63%), కామారెడ్డి (80.31%), మెదక్ (80.45%), సిరిసిల్ల (80.93%) జిల్లాల్లో డిజిటైజేషన్ వేగంగా పూర్తవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో ఇప్పటివరకు 2,19,23,435 ఫారాలు మాత్రమే డిజిటైజ్ అయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>