కొండా సురేఖ బర్తరఫ్‌పై డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగింపు అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొండా సురేఖ తొలగింపు అంశపై ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓ బీసీ మంత్రిపై ఇలాంటి చర్యలు సరైనవి కావని నిలదీస్తున్నారు. తాజాగా కొండా సురేఖ అంశంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ ( DK Aruna) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను బర్తరఫ్ చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

మహబూబ్‌నగర్ లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు డీకే అరుణ స్పందిస్తూ.. బీసీ మహిళా నాయకురాలిని బర్తరఫ్ చేయడం ఏమాత్రం సమర్ధనీయం కాదని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలే కొండా సురేఖ బర్తరఫ్‌కు కారణమని ఆరోపించారు. కొండా సురేఖ, తాను వైఎస్సార్ మంత్రి వర్గంలో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. ఆమె కూతురు చేసిన వ్యాక్యలకు కొండా సురేఖపై చర్యలు తీసుకోవడం మంచి పరిణామం కాదని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>