epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భూటాన్ బౌలర్ రికార్డ్.. ఒకే మ్యాచ్‌లో 8వికెట్లు ఫట్

కలం, వెబ్ డెస్క్:  భూటాన్‌కు చెందిన యువ స్పిన్నర్  తన బౌలింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్నే షాక్‌కు గురిచేశాడు. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మయన్మార్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో 22 ఏళ్ల సోనమ్ యేషే(Sonam Yeshey) ఈ అరుదైన ఘనతను నమోదు చేశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను పూర్తిగా కూల్చేశాడు.

ఇంతకుముందు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్ల రికార్డు మలేషియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రస్ పేరిట ఉండేది. చైనాతో జరిగిన మ్యాచ్‌లో అతడు 7 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ హోదా ఉన్న దేశాల తరఫున అత్యుత్తమ ప్రదర్శనగా భారత పేసర్ దీపక్ చాహర్ 2019లో బంగ్లాదేశ్‌పై 7 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు.

సోనమ్ యేషే (Sonam Yeshey) అద్భుత స్పెల్‌తో భూటాన్ ఈ మ్యాచ్‌లో మయన్మార్‌ను కేవలం 45 పరుగులకే ఆలౌట్ చేసి, 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భూటాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేయగా, ఆ తర్వాత సోనమ్ యేషే విధ్వంసంతో మ్యాచ్ పూర్తిగా వన్‌సైడ్ వార్‌లా మారింది.

Read Also: ఢిల్లీ హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ థాంక్స్..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>