కలం, వెబ్ డెస్క్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరోసారి అదరగొట్టాడు. జైపూర్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 60 నిమిషాల్లో 45 సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అభిషేక్ శర్మ ఆదివారం ఉదయం జైపూర్ షివార్లలోని క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేశారు. ఈ సెషన్‌లో ఆయన ఒక్క బంతినీ డిఫెండ్ చేయకుండా ఆఫ్-స్పిన్, లెగ్-స్పిన్ బంతులను స్టాండ్స్‌లోకి తిప్పారు.
ప్రత్యక్షంగా కనిపించిన ముఖ్య దృశ్యం ‘ఎక్స్‌ట్రా కవర్’ వైపు ఆడిన ఇన్ సైడ్-ఔట్ షాట్లు. అభిషేక్ శర్మ(Abhishek Sharma) సిక్సర్ల ధాటికి పక్కనపడ్డ కొన్ని అపార్ట్‌మెంట్స్‌కి కూడా బంతులు చేరాయి. ఈ ప్రాక్టీస్ సెషన్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.
Read Also: భూటాన్ బౌలర్ రికార్డ్.. ఒకే మ్యాచ్‌లో 8వికెట్లు ఫట్
Follow Us On : WhatsApp


