కలం, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఏక సభ్య కమిషన్ నివేదికపై వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) తీవ్ర విమర్శలు చేశారు. సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ హయాంలోనే లడ్డూ కల్తీ జరిగిందని కూటమి నేతలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సిట్ నివేదికపై అసంతృప్తితోనే విచారణకు ఆదేశించారని ఆరోపించారు. ఏకసభ్య కమిషన్ ఏక పక్ష కమిషన్‌గా మారి నివేదిక ఇచ్చిందన్నారు. దినేశ్ కుమార్ అనే వ్యక్తికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టే చంద్రబాబుకు అనుకూలంగా నివేదిక ఇచ్చారని ఆరోపించారు. ఇక టీడీపీ అనుకూల పత్రికలు దీనిపై దారుణంగా వార్తలు రాస్తున్నాయని ఆరోపించారు. దినేష్ కుమార్ చంద్రబాబు ఏం చెప్తే అది తూచ తప్పకుండా నివేదికలో రాశాడని ఆరోపించారు.
Read Also: హైదరాబాద్‌కు జగన్ మకాం.. సెంటిమెంట్ ఫాలో అవుతారా!
Follow Us On: Pinterest

