హైదరాబాద్‌కు జగన్ మకాం.. సెంటిమెంట్ ఫాలో అవుతారా!

కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ (YS Jagan) త్వరలోనే హైదరాబాద్‌కి మకాం మార్చబోతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లోనే ఉంటున్నారు. ముఖ్యమైన పర్యటనలు, పార్టీ నేతలతో సమావేశాల కోసం మాత్రమే వారం పది రోజులకోసారి తాడేపల్లి వచ్చి వెళ్తున్నారు. నేతలు సైతం ఆయన తాడేపల్లికి వచ్చినప్పుడు మాత్రమే కలుస్తున్నారు తప్ప బెంగళూరుకి ఎవరూ వెళ్లడం లేదని పార్టీ వర్గాల సమాచారం. జగన్ బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతుండటంపై కూటమి నేతలు తరచూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. జగన్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాలని నిర్ణయించుకున్నారట.

లోటస్‌పాండ్‌లోనే పార్టీ కార్యక్రమాలు..

2019 ఎన్నికల కంటే ముందు జగన్ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోనే నివాసం ఉండేవారు. ఇక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలు, వ్యూహాలు–ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకునేవారు. అధికారంలోకి రావడానికి ప్రధానంగా దోహదం చేసిన పాదయాత్రకు ప్రణాళికలు సైతం ఇక్కడ రూపొందించుకున్నారు. తీరా సీఎం అయ్యాక.. తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకుని అక్కడకు షిఫ్ట్ అయ్యారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్న జగన్.. పార్టీ కార్యక్రమాలను మరింతగా పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లోనే ఉండాలని డిసైడ్ అయినట్లు టాక్. ముందు నుంచీ ఈ ఇంటిని సెంటిమెంటుగా భావిస్తుంటారు. అందుకే, ఈ సారి ఎన్నికలకు ఇక్కడి నుంచి వెళ్లబోతున్నారట. ఈ మేరకు కొంతకాలంగా రిపేర్లు కూడా జరుగుతున్నాయి. అతి త్వరలోనే జగన్ (YS Jagan) ఇక్కడకు రాబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Read Also: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ : ఈసారి రెడ్లకు నో ఛాన్స్!!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>