వైభవ్ సూర్యవంశీపై జితేష్ శర్మ కీలక వ్యాఖ్యలు!

కలం, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ని ఆర్‌సీబీ వికెట్ కీపర్ జితేష్ శర్మ (Jitesh Sharma) అన్‌ప్రొషనల్ అని చర్చల్లో నిలిచారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీయడంతో, అసలు విషయం ఏంటో జితేష్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో వివరించారు. వైభవ్ తనకు అత్యంత ఆప్త మిత్రుడని, తమ్ముడి లాంటి వాడని ఆయన పేర్కొన్నారు. వారిద్దరి మధ్య ఉన్న చనువుతోనే సరదాగా అలా అన్నానని స్పష్టం చేశారు. అసలు ఈ విషయం ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానెల్‌లో జరిగిన సంభాషణతో మొదలైంది. భవిష్యత్తులో భారత స్టార్ ప్లేయర్ అయ్యేది ఎవరని ఏబీ అడిగినప్పుడు, జితేష్ వెంటనే వైభవ్ పేరు చెప్పారు. వైభవ్ టెక్నిక్, ఆడే తీరు అద్భుతంగా ఉంటాయని, మైదానంలో అతను చాలా ప్రొఫెషనల్‌గా కనిపిస్తాడని జితేష్ వివరించారు. మూడు ఫార్మాట్లలోనూ అతను రాణించగలడని ప్రశంసించారు. అయితే మైదానం బయట వైభవ్ ఇంకా ఒక చిన్న పిల్లాడేనని జితేష్ గుర్తు చేశారు.

వైభవ్ తన గదికి వచ్చి ఐస్ క్రీమ్స్ తింటాడని, తన భార్యతో మాట్లాడుతూ యూట్యూబ్ వీడియోలు చూస్తాడని చెప్పారు. 15 ఏళ్ల వయసులో ఐస్ క్రీం తినడం, కార్టూన్లు చూడటం సహజమని, అందుకే తనను తానూగా ఉండనివ్వాలని జితేష్ (Jitesh Sharma) కోరారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను తాను పట్టించుకోనని, వైభవ్ తన బ్యాటింగ్ మీద దృష్టి పెడుతూ సంతోషంగా ఉంటే చాలని జితేష్ శర్మ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ తన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మైదానంలో పరిణతి చూపిస్తూనే, వ్యక్తిగత జీవితంలో తన బాల్యాన్ని ఆస్వాదిస్తున్నారు.

Read Also: ఫస్ట్ ఇంప్రెషన్‌ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>