కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా (Khammam) కూసుమంచిలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ ఒక నిరుపేద మహిళ జీవితంలో కొత్త వెలుగులు నింపింది. కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన షేక్ షకీనా అనే మహిళకు ఎడమ కాలు లేదు. నడవలేక, తన పనులు తాను చేసుకోలేక నిత్యం నరకయాతన పడుతోంది. తన దీనస్థితిని ప్రజా దర్బార్‌కు వచ్చి మంత్రి పొంగులేటికి వివరించింది. కాలు లేక బతుకు భారమైందని.. చక్రాల కుర్చీ ఉంటే ఎవరి మీద ఆధారపడకుండా పనులు చేసుకుంటానని వేడుకుంది. దీంతో, మంత్రి పొంగులేటి వెంటనే స్పందించి.. వీల్ ఛైర్ తెప్పించాలని అధికారులను ఆదేశించారు.
రెండు గంటల్లోనే..
మంత్రి ఆదేశాలతో అధికారులు రెండు గంటల్లోనే వీల్ ఛైర్ తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో మంత్రి పొంగులేటి స్వయంగా ఆమె పక్కన నిలబడి, ఆత్మీయంగా పలకరిస్తూ వీల్ ఛైర్‌ను అందజేశారు. వీల్ ఛైర్ కోసం సంవత్సరాల తరబడి ఎంతో మందిని వేడుకున్న షేక్ షకీనా.. రెండు గంటల్లోనే తెప్పించడంపై ఆనంద భాష్పాలు రాల్చి, వీల్ ఛైర్ తీసుకుని వెనుదిరిగింది. ఏప్రిల్ 25 న మంత్రి పొంగులేటి (Minister Ponguleti) సొంత నియోజకవర్గంలోని నేలకొండపల్లిలో ప్రజా దర్బార్ ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 2 వేల వరకు దరఖాస్తులు రాగా, వీటిలో సుమారు 100 నుంచి 200 దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దరఖాస్తులను అప్పటికపుడే పరిష్కరిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే వందల సంఖ్యలో ఉచిత విద్యుత్ దరఖాస్తులను పరిష్కరించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Read Also: ల్యాండ్ వ్యాల్యూ డైలమా.. ఓ మంత్రికి, మంత్రివర్గ ఉప సంఘానికి గ్యాప్
Follow Us On: Sharechat

