తెలంగాణ బడ్జెట్‌లో కొత్త స్కీమ్స్ ఇవే..

కలం, వెబ్ డెస్క్ : రేవంత్ రెడ్డి సర్కార్ 2026-27 వార్షిక బడ్జెట్ (Telangana Budget 2026-27) ను ప్రవేశ పెట్టింది. ఆర్దిక మంత్రి భట్టి విక్రమార్క(Batti Vikramarka) శుక్రవారం రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను (Telangana Budget 2026-27) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో తొమ్మిది కొత్త స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. వాటికి అవసరమైన నిధులను కేటాయించింది. విపక్షాలన్నీ ఆరు గ్యారంటీల అమలుపై విమర్శిస్తున్నా.. ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ప్రజలకు సంక్షేమం కల్పించడంపైన ఫోకస్ పెట్టింది. వివిధ సెక్షన్ల ప్రజల అవసరాలను, అది వారి జీవితాల్లో కల్పించే ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ స్కీమ్‌ లను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ కొత్త పథకాల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా : రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం కోసం పేద, ధనిక అనే తేడా ల్లేకుండా 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.5 లక్షల జీవిత బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం అందించనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి ఈ కొత్త పథకం అమల్లోకి రానుంది. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా.. పేద, ధనిక అనే బేధాలు చూడకుండా అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.

2. చేయూత : ‘చేయూత’ పథకం కింద కొత్తగా 2 లక్షల పెన్షన్లను ఆమోదించినట్లు బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దీనికి బడ్జెట్‌లో రూ.14,861 కోట్ల కేటాయించారు.

3. తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్లు : 2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో అత్యాధునిక వసతులతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ (TPS) ఏర్పాటు కు బడ్డెట్ లో ఆమోదం లభించింది. ఎంపిక చేసిన ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక, డిజిటల్ , మౌలిక సదుపాయాలను పెంచి టీచర్లకు శిక్షణ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్ వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించేందకు తీసుకొచ్చిన ఈ స్కీమ్ కు బడ్జెట్‌లో రూ.500 కోట్ల కేటాయించారు.

4. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ : ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో కొత్తగా బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు కానుంది. ప్ర‌తీ విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మిగిలిన రోజుల్లో రాగి జావ ఇస్తారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. బడ్జెట్‌లో రూ.800 కోట్ల కేటాయింపు జరిగింది.
5. ఇంటర్ విద్యార్థులకు మిడ్-డే మీల్స్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇకపై మధ్యాహ్న భోజన సదుపాయం. బడ్జెట్‌లో రూ.100 కోట్ల కేటాయించారు.

6. నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం: ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన దాదాపు 23.51 లక్షల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం అమలు కానుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్-కార్పొరట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు చికిత్స. ప్రతీ ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు.

7. ఉద్యోగుల ప్రమాద బీమా పథకం: ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకంను భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే 1.20 కోట్ల ప్రమాద బీమా వస్తుంది. 60 ఏండ్ల వరకు రూ. 10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది . విమాన ప్రమాదంలో మరణిస్తే రూ. 2 కోట్ల అదనపు కవరేజ్ ఇవ్వబడుతుంది. . సుమారు 7.57 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అందుతోంది. బడ్జెట్‌లో దీనికి రూ. 1,056 కోట్ల కేటాయింపు జరిగింది.

8. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం: యువతకు వివిధ రంగాలలో తగిన నైపుణ్య శిక్షణను, వారికి ఉపాధి లభించిన దేశాల్లో భాషా జ్ఞానంలో శిక్షణ ఇప్పించడం, వీసా అసిస్టెన్స్, విదేశీ ప్రయాణ ఏర్పాట్లు, విదేశాలలో ఆరోగ్య సేవలు, హస్పిటాలిటీ, నిర్మాణపు పనులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ‘సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం’ తీసుకొచ్చారు . బడ్జెట్‌లో ఈ స్కీమ్ కు రూ.1,056 కోట్ల కేటాయింపు జరిగింది.

9. ATC ట్రైనీలకు స్కాలర్ షిప్: ఈ స్కీమ్ ద్వారా ఏటీసీ (ఐటీఐ)లలో శిక్షణలో ఉన్న ట్రైనీలకు ప్రతి నెలా రూ. 2 వేల చొప్పున స్కాలర్ షిప్ ఇవ్వబడుతుంది. బడ్జెట్‌లో రూ.80 కోట్ల కేటాయించారు.

Read Also: 2028 వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్‌షిప్స్ కు భారత్ ఆతిథ్యం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>