త్వరలోనే దేవాదుల పూర్తి: భట్టి విక్రమార్క

కలం, జనగామ: దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి (Bhatti) విక్రమార్క స్పష్టం చేశారు. ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం ఒకప్పుడు వలసలకు నిలయంగా ఉండేదని పేర్కొన్నారు.

ఆ పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర అభివృద్ధిదిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఏ ప్రాంతంలో నీరు ప్రవహించాలన్నా విద్యుత్ అవసరమేనని స్పష్టం చేశారు. అందుకే విద్యుత్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తూ, అవసరాలకు అనుగుణంగా నవీకరణచేస్తూ అనేక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తోందని వివరించారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజల క్షేమం కోసం ప్రభుత్వపరంగా అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Read Also: భాకరాపేట ఘాట్‌లో తృటిలో తప్పిన బస్సు ప్రమాదం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>