కలం, హనుమకొండ: అన్నార్థుల ఆకలి తీర్చడం మహా సంకల్పమని, భద్రకాళి సేవాసమితి నిర్వాహకుల సంకల్పం అన్నప్రసాద వితరణ అని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కాళీ ప్రసాద్ అన్నారు. హనుమకొండ (Hanamkonda) బాలసముద్రంలో సోమవారం నిర్వహించిన అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించడమే కాకుండా ఎండ వేడిని తట్టుకొని అన్నార్థులకు సేవ చేసేలా భగవంతుడు ఆశీర్వదించడం శుభసూచకమని చెప్పారు .
ప్రతి నెల అమావాస్య రోజున నిర్వహించే కార్యక్రమానికి తన వంతు సహకారం కూడా అందిస్తానని చెప్పారు.సుమారు 600 మందికి అన్న ప్రసాదం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పిన్నా శివకుమార్, చోల్లేటి శ్రీధర్ మ హేష్, పొడిచెట్టి విష్ణువర్ధన్, నల్లా దిలీప్ , ప్రభాకర్, రిటైర్డ్ హెడ్మాస్టర్ నారాయణరెడ్డి రిటైర్డ్ ఎల్ఐసి అధికారి పాములపర్తి కేశవకుమార్ , సీనియర్ న్యాయవాది అల్లం రాజేష్ వర్మ పాల్గొన్నారు.

