పాములేరు వాగు ఉగ్రరూపం.. ఆ మార్గంలో రాకపోకలు బంద్!

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohith Raju) స్పష్టం చేశారు. వర్షాల ఉధృతి మరింత పెరిగితే స్థానిక ప్రజలను ముందస్తుగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామం వద్ద పాములేరు వాగు వరద ఉధృతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​ఈ సందర్భంగా వాగులో పెరుగుతున్న వరద ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలపై దాని ప్రభావాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాములేరు వాగులో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తాళ్లపాయి గ్రామం నుంచి బూర్గంపాడు వెళ్లే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద తగ్గే వరకు ప్రజలు ఈ మార్గంలో ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.

​అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డీడీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఎస్పీ రోహిత్ రాజు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>