పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: పల్లె రవి కుమార్ గౌడ్

కలం, మునుగోడు: పట్టభద్రుల ఓటరు నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ (Palle Ravi Kumar Goud) విజ్ఞప్తి చేశారు. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చండూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమాకాంత్ శర్మకు తన దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా పల్లె రవి కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పట్టభద్రులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతంలో ప్రతి పట్టభద్రుడి ఓటు కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నవంబర్ 6, 2026లోగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, తమతో పాటు ఇతర పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించి నమోదు ప్రక్రియలో భాగస్వాములను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చండూరు మాజీ ఎంపీపీ పల్లె కళ్యాణి రవికుమార్ గౌడ్, బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు మహ్మద్ యూసుఫ్, డిప్యూటీ తహసీల్దార్ సరిత, యువజన నాయకులు మాధగోని అరుణ్ కుమార్, యనమల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>