వ‌లిగొండ అభివృద్ధి ప్ర‌ణాళిక‌పై అధికారుల స‌మావేశం

కలం, వలిగొండ: నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మండల ప్రత్యేక అధికారి జగన్నాథ‌ రావు అన్నారు. బుధవారం వలిగొండ (Valigonda) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 45 రోజుల గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావాల వల్ల కలిగే పరిణామాలు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివ‌రించారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపుదలకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి, తహసీల్దార్ దశరథ నాయక్, మండల స్థాయి అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>