కలం, వెబ్ డెస్క్ : బెంగళూరు నగరంలోని కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గోవిందరాజు (KP Agrahara Inspector) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఒక వ్యక్తిని చీటింగ్ కేసులో ఇరికిస్తానని బెదిరించి, ఆ పని చేయకుండా ఉండటానికి ఆయన 4 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు.
బాధితుడి నుంచి ఆ నగదును తీసుకుంటున్న సమయంలో ఏసీబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది. అయితే తన నేరం బయటపడటంతో కంగుతిన్న ఇన్‌స్పెక్టర్, అక్కడున్న ప్రజల సానుభూతి పొందేందుకు పెద్దగా కేకలు వేస్తూ నానా హంగామా చేశారు. అధికారుల నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


