బేగంపేట పైలట్ శిక్షణ కేంద్రంలో దారుణం.. యువతిపై అత్యాచారం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని బేగంపేటలో (Begumpet) ఉన్న ఏవికన్స్ పైలట్ శిక్షణ సంస్థలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. పైలట్ (Pilot) కావాలన్న ఆశయంతో శిక్షణకు చేరిన ఓ యువతిని, అదే సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన నసిముద్దీన్ అనే వ్యక్తి తన వక్రబుద్ధితో చిదిమేశాడు. 2025 జనవరి నుంచి సదరు యువతిపై శిక్షణ పేరుతో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాలను ఫోటోలు, వీడియోలు తీసి బయటపెడతానంటూ బెదిరింపులకు గురిచేశాడు. నిందితుడి వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో తట్టుకోలేకపోయింది. బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Read Also: నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>