కలం, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందింది. అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Director Atlee) కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకగా రూపొందుతున్న ‘AA22’ చిత్రానికి ‘రాకా’ (Raaka) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసింది. కొద్ది నిమిషాల క్రితమే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని విధంగా కనిపించాడు. గుండుతో, కళ్లకు కాటుక పెట్టుకుని, ఒంటిపై వింత ఆకృతులతో కూడిన డార్క్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో భారీ స్థాయి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అదిరిపోయే ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఏడు భాషల్లో పాన్-వరల్డ్ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా 2027 వేసవిలో ప్రేక్షకులను పలకరించనుంది. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ (Allu Arjun) మేకోవర్ చూస్తుంటే ఈ సినిమా రికార్డులను సృష్టించడం ఖాయమని తెలుస్తోంది.
Read Also: అకీరా బర్త్‌డే… పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్!
Follow Us On: Instagram

