కలం, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్ (Iran) వ్యవహరించిన తీరును ప్రశంసిస్తూ టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra) భారత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇరాన్‌లా భారత్ కూడా సొంత విధానాలు ప్రకటించాలని ఎక్స్ వేదికగా సూచించారు. ఇరాన్ దేశం ప్రపంచానికి ధైర్యంగా ఉండటం అంటే ఏమిటో నేర్పిందని ప్రశంసించారు. భారత నాయకత్వం బెదిరింపులకు పాల్పడే వారిని ఇకనైనా గట్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. భారత్ కాల్పుల విరమణ ఒప్పందాలను, వాణిజ్య ఒప్పందాలను, ఇంధన విధానాలను ధైర్యంగా ప్రకటించుకోవాలని, ఇతరులపై ఆధారపడకూడదని ఆమె పేర్కొన్నారు.
ఇరాన్‌లోని వంతెనలపై దాడులు జరుగుతాయని సమాచారం ఉన్నప్పటికీ, ప్రమాదం అని తెలిసినా అక్కడి ప్రజలు మానవహారంగా ఏర్పడి వాటిని కాపాడుకున్నారని, ఆ దృశ్యం ఈ శతాబ్దాన్ని నిర్వచించే చిత్రమని మోయిత్రా (Mahua Moitra) కొనియాడారు. ఫాసిస్టు శక్తులను ఓడించడానికి సామాన్య పౌరుల ధైర్యం సరిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు.
Read Also: నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా?
Follow Us On: Instagram

