ఐపీఎల్ టీం హోటల్ రూల్స్‌పై బీసీసీఐ కొత్త కోడ్ ఆఫ్ కండక్ట్

కలం, వెబ్ డెస్క్ : క్రికెట్‌లో క్రమశిక్షణపై బీసీసీఐ (BCCI) ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మరీ ముఖ్యంగా ఐపీఎల్ (IPL) సమయంలో ఆటగాళ్లు తమ వెంట తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను తీసుకొచ్చే సంప్రదాయానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో కఠిన నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ, ఐపీఎల్‌లో ఇటీవల ఇది ఒక ట్రెండ్‌గా మారినట్లు బీసీసీఐ (BCCI) వర్గాలు పేర్కొంటున్నాయి.

స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి టీమ్ హోటళ్లలో కనిపించారు. వీరు హోటళ్లలోనే కాకుండా టీమ్ బస్సుల వరకు కూడా వారితో కలిసి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై తదుపరి బీసీసీఐ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు అధికారి ప్రకారం, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, భార్యలు హోటళ్లలో ఉండటానికి ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ గర్ల్‌ఫ్రెండ్స్‌ విషయంలో నియంత్రణ అవసరమని తెలిపారు.

ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్‌లో చాలామంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా ఉన్నారని, దీనివల్ల జట్టులోని అంతర్గత సమాచారం అనుకోకుండా బయటకు వచ్చే ప్రమాదం ఉందని బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా, ఐపీఎల్ యాంటీ కరప్షన్ నిబంధనలను మరింత పటిష్టం చేయడానికి కూడా ఈ నిర్ణయం తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లపై బీసీసీఐకి పూర్తి నియంత్రణ ఉంటుంది. కానీ ఐపీఎల్‌లో పది విభిన్న ఫ్రాంచైజీలు ఉండటం, అవి ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉండటం వల్ల మైదానం వెలుపల జరిగే కదలికలను గమనించడం కొంత కష్టంగా మారింది. అందుకే ఐపీఎల్ జట్ల హోటల్ గదులలో ఎవరు ఉండాలనే దానిపై స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తోంది. రానున్న రోజుల్లో ఈ కొత్త రూల్స్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also: ఫస్ట్ ఇంప్రెషన్‌ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>