BC Bandh | బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్‌కు బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. అదే విధంగా శనివారం రాష్ట్ర బంద్‌ను అమలు చేస్తున్నాయి. ఈ బంద్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోయాయి. దీంతో ఊళ్లకు, కార్యాలయాలకు వెళ్లేవారికి క్యాబ్‌లే గతవుతున్నాయి. రైల్వే స్టేషన్ వరకు వెళ్లడానికి కూడా క్యాబ్‌లు బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఇదే మంచి ఛాన్స్ అనుకున్న హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు.. డుబుల్ ఛార్జ్‌లు వసూలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉప్పల్ నుంచి హనుమకొండకు వెళ్లడానికి సాధారణ రోజుల్లో రూ.300 ఛార్జ్ చేస్తే.. ఇప్పుడ్ బంద్ సందర్భంగా ఆ ఛార్జీని రూ.700కు పెంచారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు.
అయితే బీసీ బంద్(BC Bandh)లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బస్ డిపోల దగ్గర అఖిలపక్ష నాయకులు, బీసీ నేతలు, బీసీ సంఘాల వారు భారీ ఎత్తున నిరసన తెలుపుతున్నారు. బీసీల విషయంలో అన్యాయం జరుగుతోందని నినాదాలు చేస్తున్నారు. అయితే బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని పోలీసులు తెలిపారు. అత్యవసర సేవలకు ఆటంకం కలిగించకూడదని సూచించారు పోలీసులు.

