కలం, స్పోర్ట్స్ : స్పానిష్ ఫుట్‌బాల్ దిగ్గజం బార్సిలోనా క్లబ్ మరో లాలిగా టైటిల్‌కు అడుగు దూరంలో ఉంది. ఆదివారం రియల్ మాడ్రిడ్‌తో జరగబోయే హై-వోల్టేజ్ ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్‌లో బార్సిలోనా ఓటమి తప్పించుకుంటే చాలు, వారు ఛాంపియన్‌లుగా పట్టాభిషేకం చేసుకుంటారు. ప్రస్తుతం 88 పాయింట్లతో ఉన్న బార్సిలోనా, రెండో స్థానంలో ఉన్న రియల్ మాడ్రిడ్ కంటే 11 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ కీలక పోరుకు ముందు బార్సిలోనా యువ సంచలనం ఫెర్మిన్ లోపెజ్ (Fermin Lopez) తన మనసులోని మాటను పంచుకున్నారు. చిన్నప్పటి నుండి తనను ప్రభావితం చేసిన ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బార్సిలోనా అకాడమీ ‘లా మాసియా’ నుండి వచ్చిన ఫెర్మిన్, చిన్నప్పటి నుండి లియోనెల్ మెస్సీ, ఆండ్రెస్ ఇనియస్టాలను తన రోల్ మోడల్స్‌గా భావించేవాడినని తెలిపారు. ఈ ఇద్దరు దిగ్గజాలు బార్సిలోనా కోసం చేసిన అద్భుతాలను మళ్ళీ చేయడం ఎవరికైనా అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, తన శక్తి మేరకు జట్టుకు గోల్స్, అసిస్ట్‌లతో సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని లోపేజ్ (Fermin Lopez) చెప్పారు.

