Mobile Popup Ad
Mobile Popup Ad

మృత్యువు అంచున పునర్జన్మనిచ్చిన ‘ఖాకీ’ హీరోలు

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada) పోలీసులు రియల్ హీరోలు అనిపించుకున్నారు. ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఓ వ్యక్తిని చివరి నిమిషంలో మృత్యువు నుంచి కాపాడి శభాష్ అనిపించుకున్నారు. బాన్సువాడ పట్టణంలో ఆస్తి పంపకాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని మనస్తాపం చెందిన గూడెం గల్లికి చెందిన రంగరి వెంకటి (55), ఆత్మహత్యే శరణ్యమని భావించి ఉరి వేసుకొని చనిపోతున్నానని డయల్ 100కు సమాచారం అందించారు. క్షణాల్లో స్పందించిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.

స్థానికుల సహాయంతో ఖచ్చితమైన చిరునామాను సేకరించిన బాన్సువాడ (Banswada) పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటి తలుపులు పగలగొట్టారు. అప్పటికే వెంకటి ఉరి వేసుకొని కొన ఊపిరితో వేలాడుతుండటం గమనించి అతడిని కిందికి దించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్య సాయం అందడంతో బాధితుడు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. విధి నిర్వహణలో సమయస్ఫూర్తిని ప్రదర్శించి వెంకటి ప్రాణాలను కాపాడిన పోలీసు కానిస్టేబుల్ డి. నవీన్ హోంగార్డ్ రాములును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100ను ఆశ్రయించడం పోలీసులు ఇంత వేగంగా స్పందించడం ప్రజల్లో పోలీసు శాఖ పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేస్తుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>