Mobile Popup Ad
Mobile Popup Ad

బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్… ఐటీ అదుపులో ‘కొండ’

కలం, వెబ్ డెస్క్: ఒంటి మీద కేజీల కొద్దీ గోల్డ్‌ జ్యువెలరీతో పాపులారిటీ సంపాదించిన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన బంగారు బాబు (Bangaru Babu) అలియాస్‌ కొండ విజయ్‌ కుమార్‌ కు బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు శేరిలింగంపల్లికి చెందిన వ్యాపారవేత్త, హోప్ ఫౌండేషన్ ప్రతినిధి, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్‌ను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి బయలుదేరిన కొండ విజయ్ కుమార్ ను హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో (RGIA) స్థానిక ఐటి అధికారులు అడ్డుకొని పాన్ కార్డు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం కొండ విజయ్ కుమార్ న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే అక్కడి ఢిల్లీ ఐటీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. దీంతో ఎయిర్ పోర్టులోనే విచారణ చేశారు. విచారణ సమయంలో ఆయన వద్ద ఉన్న మొత్తం బంగారాన్ని పూర్తిగా సీజ్ చేశారు. ఆయన పేరుతో ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే దాదాపు 12 గంటల పాటు కొండ విజయ్ కుమార్ ను విచారణ చేసిన అనంతరం హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు తాత్కాలిక అనుమతి ఇచ్చారు. కొండ విజయ్‌ కుమార్‌ ను (Bangaru Babu) మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.

Read Also: గ్రామీణ భారత ‘నీటి’ సంక్షోభంపై గళమెత్తిన బాలీవుడ్ నటి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>