కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ (Iran) యుద్ధం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఎంతోమంది ఈ యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో దేశాలు ఆయిల్ సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ యుద్ధం ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. ఈ నెల రోజుల యుద్ధంలో ఇరాన్ మీదకు 850 మిస్సైళ్లను ప్రయోగించింది అమెరికా (America). ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. ఇంత పెద్ద ఎత్తున మిస్సైళ్లను ప్రయోగించడంపై పెంటగాన్ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరిన్ని తోమహాక్ మిస్సైళ్లను ఎలా సమీక్షించాలని వైట్ హౌస్ అంతర్గతంగా చర్చించిందని వాషింగ్టన్ పోస్టు తన కథనంలో పేర్కొంది.
ఒక దేశంపై అమెరికా ఇంత పెద్ద ఎత్తున మిస్సైళ్లను ప్రయోగించడం చాలా అరుదు అని.. ఇప్పుడు ఇరాన్ (Iran) విషయంలో అది జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ యుద్ధం వల్ల ఇరాన్ లో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది బిల్డింగులు ధ్వంసం అయ్యాయి. ఇరాన్ ఆర్థికంగా చాలా నష్టపోయింది. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. కానీ ఆ చర్చలు అనుకున్న స్థాయిలో జరగట్లేదనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే అమెరికా ప్రతిపాదనలకు ఇరాన్ ఒప్పుకోవట్లేదు. అమెరికా (America) ఈ విషయంలో వెనక్కు తగ్గట్లేదు. కానీ త్వరలోనే కీలక అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
Read Also: కరీంనగర్‌లో భారీ బ్యాంకింగ్ స్కాం.. 130 కోట్ల మోసం
Follow Us On : WhatsApp

