Mobile Popup Ad
Mobile Popup Ad

దేవాదుల పంపుహౌస్ ను పరిశీలించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి

కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanumakonda) జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌస్ తోపాటు ధర్మసాగర్ లోని రిజర్వాయర్, సౌత్ మెయిన్ కెనాల్ ను కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు శుక్రవారం సందర్శించారు. దేవన్నపేట పంప్ హౌస్, ధర్మసాగర్ సౌత్ మెయిన్ కెనాల్ వివరాలను అధికారులు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కి వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర ఆర్ అండ్ అర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ సింగ్, సిడబ్ల్యుసి డైరెక్టర్ శ్రీనివాస్, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఇఎన్సీ జనరల్ రమేష్ బాబు, చీఫ్ ఇంజనీర్ సుధీర్, ఇరిగేషన్ ఎస్ ఈ రాం ప్రసాద్, ఈఈలు సీతారాం,మంగీలాల్, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, జిల్లా సాగునీటిపారుదల శాఖ అధికారి రామ్మోహన్, మెగా ప్రాజెక్టు మేనేజర్ తిరుపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలి..

హనుమకొండ (Hanumakonda) జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి విఎల్ కాంతా రావు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో (Sandeep Kumar Jha) కలిసి నష్కల్, పాలకుర్తి, నవాబుపేట రిజర్వాయర్లు మరియు కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల మ్యాపింగ్‌ను సమీక్షించిన ఆయన, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, సాగునీరు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సీతారాం, సీఈ సుధీర్, ఈఎన్సీ రమేష్ బాబు, ఆర్డీఓ వెంకన్న తదితర అధికారులు పాల్గొన్నారు.

Read Also: బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్… ఐటీ అదుపులో ‘కొండ’

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>