కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి విషయం అయినా బండ్ల గణేష్ ముక్కు సూటిగా మాట్లాడతారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతానికి తాను ఏ సినిమాను నిర్మించడం లేదని త్వరలో కొత్త ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తానని ఆయన తెలిపారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు( Chandrababu) స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన ఆ కేసు నుంచి బయట పడాలని చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ సీఎం అవ్వాలని ఆయనకు అభిమాని అయిన బండ్ల గణేష్, తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ఆ తరువాత చంద్రబాబు బెయిల్ మీద బయటకు రావడం, అదే ఊపులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన మొక్కు తీర్చుకునేందుకు బండ్ల గణేష్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన ఇంటి నుంచి తిరుమలకు ఆయన మహా పాదయాత్రగా బయలుదేరి వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.

Read Also: ప్రజలు బుద్ది చెప్పినా జగన్ తీరు మారలేదు : చంద్రబాబు
Follow Us On: Sharechat


