కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం 2014 నుంచే ప్రారంభమైందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. అయితే ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలాటగా మార్చిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో పనులు జరుగుతున్నాయని.. ఇప్పుడైనా వెళ్లి చూడాలని సజ్జలకు మంత్రి సూచించారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యం అయిందని, ఇప్పుడు ఆ లోటును పూడ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. తమకు రాజధాని అమరావతియేనని.. వైసీపీ రాజధాని ఎక్కడుందో చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు.

Read Also: ప్రజలు బుద్ది చెప్పినా జగన్ తీరు మారలేదు : చంద్రబాబు
Follow Us On: Pinterest


